Tuesday, June 15, 2010

సినిమా అభిమాని

నేనొక సినిమా అభిమానిని. వచ్చిన ప్రతి సినిమా చూడక పోయినా మంచి సినిమా, కొత్త దనం ఉన్న సినిమా అనిపించిన వన్నీ తప్పక చూస్తాను. చూసి ఊరుకోక పదే పదే స్నేహితులతొ చర్చిస్తాను. అసలు మనమైతే ఈ కథ ఈ లెవల్లో ఉండేది. హీరో ఎన్ట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇచ్చే ట్విష్ట్ కి ప్రేక్షకుడి దిమ్మ తిరిగి పోవాలి అని స్నేహితులం అందరం ఊహల్లో ఊరేగుతూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ గంటలు గడిపేస్తుంటాము. బ్లాగులు పరిచయమైన తరువాత ఆ కబుర్లే కథనాలుగా మార్చి బ్లాగులో పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్న ఆలోచనకు రూపమే ఇలా మీముందుంది.

సినిమా గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఆ తెలియని తనమే కొత్త దనానికి శ్రీకారం అని భావించి మూస పాత పద్ధతుల గురించి పెద్దగా ఆలోచించను. కలలే కానీ కార్య రూపమేమీ దాల్చలేదు. కలలు కలలుగానే మిగులుతాయో కార్యరూపం దాల్చుతాయో ఈ బ్లాగే చెప్పాలి. సినిమా చూసినతరువాత కూడా ఏవో కొత్త ఆలోచనలు రేగి రకరకాల రంగులు పులుముకుని సినిమా కలలు కంటూ కాలం గడిపే నాకులాంటి అభిమానులందరికీ స్వాగతం. సినీ పండితులందరికీ నమస్కారం.